రికార్డ్ ధరతో OTTలో షారుఖ్ ఖాన్ జవాన్..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

రికార్డ్ ధరతో OTTలో షారుఖ్ ఖాన్ జవాన్..స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

బాలీవుడ్ బాద్షా షారుఖ్(Shah Rukh)..జవాన్(Jawan) మూవీతో బాక్సాఫీస్ వసూళ్లను క్రియేట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ ఓటీటీ లోను రికార్డ్ క్రియేట్ చేసే ధర పలికినట్లు తెలుస్తోంది. జవాన్ హక్కుల కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీపడినప్పటికీ..చివరికి నెట్‌ఫ్లిక్స్‌(Netflix) రూ.250 కోట్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకోగా..అక్టోబ‌ర్ లాస్ట్ వీక్లో గానీ, నవంబ‌ర్ ఫస్ట్ వీక్లో గానీ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.  

సోషల్ కంటెంట్తో వచ్చిన జవాన్ మూవీ ఆడియన్స్ను ఆలోచింపజేస్తుంది. రైతులు ఎక్కువ వడ్డీలకి లోన్ తీసుకోవడం..సరైన టైములో చెలించకపోవడం..ఇక బ్యాంక్ వాళ్ళు పెట్టె టార్చర్ తట్టుకోలేక..రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చూపించారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైన మెడికల్ ఇంస్ట్రుమెంట్స్ లేక ప్రజలు ఎలా చనిపోతారో వంటి.. అంశాలను చూపించారు. 

ఇప్పటికే పఠాన్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్ చేసిన షారుఖ్.. ఆ సినిమా రికార్డ్ ను జవాన్ తో అవలీలగా దాటేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రూ.574 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ మూవీ మరి వారం రోజుల్లో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. దీంతో వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ రికార్డ్స్ లోకి ఎక్కనున్నాడు. సోమవారం కూడా బుకింగ్స్‌ ఓ రేంజ్‌లో ఉండటంతో.. రానున్న రోజుల్లో కూడా ఈ కలెక్షన్ల సునామి ఇలాగే కొనసాగేలా ఉంది. అంతేకాదు నెలాఖరివరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో.. జవాన్ కు అది కలిసొచ్చే అంశంలాగే ఉంది. 

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా డ్యూయల్ రోల్ లో కనిపించారు. షారుఖ్‌కు జోడీగా నయనతార, దీపికా పదుకొనే కనిపించగా..విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు.