నాలుగు రోజుల్లో రూ.500 కోట్లు.. ఇది జవాన్ విధ్వంసం

నాలుగు రోజుల్లో రూ.500 కోట్లు.. ఇది జవాన్ విధ్వంసం

నాలుగు రోజుల్లో రూ.500 కోట్లు..  థియేటర్స్ లో జవాన్(Jawan) సినిమా సృష్టిస్తున్న విధ్వంసం ఇది. షారుఖ్(Shah rukh khan) డ్యూయల్ రోల్ దెబ్బకు రికార్డ్స్ అన్నీ బద్దలవుతున్నాయి. సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 

ఇప్పటికే పఠాన్ సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్ చేసిన షారుఖ్.. ఆ సినిమా రికార్డ్ ను జవాన్ తో అవలీలగా దాటేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ మూవీ మరి వారం రోజుల్లో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది. దీంతో వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన హీరోగా షారుఖ్ రికార్డ్స్ లోకి ఎక్కనున్నాడు. సోమవారం కూడా బుకింగ్స్‌ ఓ రేంజ్‌లో ఉండటంతో.. రానున్న రోజుల్లో కూడా ఈ కలెక్షన్ల సునామి ఇలాగే కొనసాగేలా ఉంది. అంతేకాదు నెలాఖరివరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో.. జవాన్ కు అది కలిసొచ్చే అంశంలాగే ఉంది. 

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా డ్యూయల్ రోల్ లో కనిపించారు. షారుఖ్‌కు జోడీగా నయనతార, దీపికా పదుకొనే కనిపించగా.. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు.