జవాన్ కలెక్షన్స్ సునామీ : రూ.104 కోట్లతో షారూఖ్ కొత్త రికార్డ్

జవాన్ కలెక్షన్స్ సునామీ : రూ.104 కోట్లతో షారూఖ్ కొత్త రికార్డ్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Sharukh khan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan). తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్(Atlee kumar) తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్(Pataan) వంటి బ్లాక్ బస్టర్ తరువాత షారుఖ్ నుండి వస్తున్న సినిమా కావడంతో జవాన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ లోనే రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని రాబట్టి ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ తిరగరాసింది ఈ సినిమా. 

ఈ క్రమంలోనే మొదటిరోజు రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా రూ.104 కోట్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బాలీవుడ్ చరిత్రలో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.   

ఇక మొదటి షో నుండే జవాన్ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ సినిమాకు బీభత్సమైన కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పఠాన్ తరువాత జవాన్ తో మరోసారి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరనున్నారు కింగ్ ఖాన్. ఇవన్నీ చూస్తుంటే బాలీవుడ్ లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలువనుంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్ కింగ్ కంటే కింగ్ ఖాన్ షారుఖ్ ఖానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నయనతార, దీపికా పాడుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి స్టార్ ప్రధాన పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ సంస్థ పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించాడు.