పఠాన్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ యాక్షన్

పఠాన్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ యాక్షన్

ఎప్పుడెప్పుడు షారుఖ్ ఖాన్‌ సినిమా వస్తుందా అని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ‘జీరో’ తర్వాత షారుఖ్ నుండి మరో సినిమా రాలేదు. ఆ గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేసేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ముందుగా వస్తోన్న సినిమా ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాలో దీపిక పదుకొణె హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జనవరి 25న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అంచనాలు పెంచిన మేకర్స్, బుధవారం ట్రైలర్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు.  

ఈనెల 10న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ఇదే టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఇక ‘వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లాంటి యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెప్పించిన సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేస్తున్న సినిమా కావడంతో అంచ నాలు కూడా ఎక్కువే ఉన్నాయి. మరి కిందటేడాది వరుస ఫ్లాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందుకున్న బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ‘పఠాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో తిరిగి సక్సెస్ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి వస్తుందేమో చూడాలి!