సమయం మించి పోకముందే బీజేపీతో కలవాలి

సమయం మించి పోకముందే బీజేపీతో కలవాలి

శివసేన లీడర్లను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్. సెంట్రల్ ఏజెన్సిల ఇబ్బందులు తప్పించుకోవాలంటే మళ్లీ బీజేపీతో జట్టు కట్టాలని లేఖలో పేర్కొన్నారు.  సమయం మించి పోకముందే బీజేపీతో కలవాలన్నారు. ముఖ్యంగా త్వరలో థానే, ముంబై కార్పొరేషన్ ఎన్నికలున్నాయన్నారు. తనతో పాటు అనిల్ పరబ్, రవీంద్ర వైకర్ ఫ్యామిలీలను కేంద్ర సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. సమస్యల నుంచి తప్పించుకోవాలంటే మోడీతో చేతులు కలపడమే మంచిదని శివసైనికులు భావిస్తున్నారని లేఖలో చెప్పారు సర్నాయక్. జూన్ 10న ఈ లేఖ సీఎం ఉద్ధవ్ థాక్రేకు చేరింది. గతేడాది మనీ లాండరింగ్ కేసులో ప్రతాప్ సర్నాయక్ కు చెందిన ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది. సర్నాయక్ కొడుకు విహంగ్ ను కూడా దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన.