సినీ పరిశ్రమలో 13ఏళ్లు పూర్తి చేసుకున్న శృతి హాసన్

సినీ పరిశ్రమలో 13ఏళ్లు పూర్తి చేసుకున్న శృతి హాసన్

తన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే బ్యూటీఫుల్ హీరోయిన్ల సరసన నిలిచిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ .. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 13ఏళ్లు గడిచింది. అందుకే ఈ డేస్ ని ఆమె మ్యాజికల్ 13 ఇయర్స్ గా అభివర్ణిస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తాను సినిమాల్లో నటిస్తానని గానీ, ఇన్నేళ్లు పరిశ్రమలో పనిచేయాలని కానీ ఎప్పుడూ అనుకోలేదని ఆమె వెల్లడించింది. కానీ ఇన్ని సంవత్సరాలలో పనని పనిని ఎలా ప్రేమించాలో మాత్రం నేర్చుకున్నానని తెలిపింది. సినిమా నా జీవితంలో ఆనందానికి కారణమైందన్న ఆమె...  ఇది తనకు చాలా కృతజ్ఞతతో ఉన్న జీవితాన్ని ఇచ్చిందని చెప్పారు. 

ఇన్ని సంవత్సరాలలో విజయాన్ని, వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నానని పేర్కొంది. అంతే కాకుండా తనకు లభించిన ప్రేమ, ప్రశంసలకు ఎప్పటికీ కృతజ్ఞురాలినని, తాను దానిని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోనని చెప్పింది. "ఈ 13 సంవత్సరాలకు థాంక్యూ థాంక్యూ" అంటూ శృతి హాసన్ ఈ వీడియోను జోడించింది. ఇదిలా ఉండగా కమల్ హాసన్, సారిక దంపతులకు జన్మించిన శ్రుతి హాసన్... 2009లో ఇమ్రాన్ ఖాన్ సరసన లక్ చిత్రంతో తొలిసారిగా నటించింది. అప్పటి నుండి తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ.. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.