V6 News

MS Dhoni: ధోనీ కావాలనే చెన్నై సూపర్ కింగ్స్కి దూరంగా ఉంటున్నాడు.. 

MS Dhoni: ధోనీ కావాలనే చెన్నై సూపర్ కింగ్స్కి దూరంగా ఉంటున్నాడు.. 

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ అనడంలో అతిశయోక్తి లేదు.. ఐపీఎల్ ఆరంభం నుంచి అంతా తానై చెన్నైని ముందుకు నడిపించాడు. తన సారథ్యంలో రికార్డు స్థాయిలో జట్టును ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచాడు. కానీ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పటి వరకు అతడి వారసుడిగా ఎవరూ పెద్దగా రాణించలేదు.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు 2022లో బాధ్యతలు ఇవ్వగా అతడు ఒత్తిడి భరించలేక మధ్యలోనే జట్టుకి దూరమయ్యాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ కి ధోని స్థానంలో సారథిగా చేశారు. 

కానీ గతేడాది ఐదు మ్యాచుల తర్వాత గాయంతో టోర్నమెంట్ మధ్యలోనే అతడు బయటకి వెళ్లిపోయాడు. దీంతో ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టగా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్-2025లో సీఎస్ కే పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్ లో నిలిచింది.  ఇక 44 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ ధోని చెన్నై తరఫున బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. ఐపీఎల్-2026లో సీఎస్కే ఇప్పటికే 7 మ్యాచులు ఆడేసింది. అయినా ఇంత వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా బరిలోకి దిగలేదు. పిక్కల్లో గాయంతో అతడు జట్టుకు దూరంగా ఉంటున్నట్లు చెన్నై యాజమాన్యం ప్రకటించింది.

ధోని కావాలనే దూరంగా ఉంటున్నాడు?: 
ముంబై ఇండియన్స్ తో 2026, ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్ కి ముందు మహేంద్ర సింగ్ ధోనీ బాగానే ప్రాక్టీస్ చేసినట్లు వీడియోల్లో కనిపించింది. అయినప్పటికీ అతడు బరిలోకి మాత్రం దిగలేదు. కనీసం స్టేడియంలో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ధోని కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ..  ఎంఎస్ ధోని ఫిట్ గానే కనిపిస్తున్నప్పటికీ, జట్టుకు మాతరం దూరంగా ఉంటున్నాడు.. కనీసం జట్టుతో కలిసి గ్రౌండ్ కి కూడా రావట్లేదు.. వీలైనంతగా లైమ్ లైట్ కి దూరంగా ఉంటున్నారు. అతను కావాలనే జట్టుకు దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది.. తాను లేకుండా జట్టు ముందుకు నడిచేలా ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నాడని సైమన్ డౌల్ వెల్లడించారు. 

►ALSO READ | RCB vs GT మధ్య టఫ్ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే!

రుతురాజ్, సంజూపై ఫోకస్ ఉండేలా: 
మహేంద్ర సింగ్ ధోనీ తనకు తానే తన క్రేజ్ తగ్గించుకుని.. కొత్త బృందంపై దృష్టి పడేలా చేస్తున్నట్లు అనిపిస్తుంది. జట్టును వారు తమ చేతుల్లోకి తీసుకునేలా ముందుకు సాగుతున్నాడని డౌల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా గతంలోనూ రుతు కెప్టెన్ గా ఉన్నా.. స్టేడియంలో అతడికి సలహాలు, సూచనలు ఇస్తూ ధోని అంతా తానై నడిపించేవాడు.. కానీ ఈసారి సంజూ శాంసన్ రాకతో ధోని తనపై ఉన్న భారాన్ని తగ్గించుకుని.. నాయకత్వ బృందంలో రుతుతో పాటు సంజూ భాగమయ్యేలా చేయడమే తన ప్రధాన ఉద్దేశంగా అనిపిస్తోంది. కాగా మహేంద్రుడి స్థానంలో సంజూ వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టాడు. ముంబైతో జరిగిన మ్యాచులో శాంసన్ సెంచరీతో చెలరేగి.. సీఎస్కేకు మూడో విజయం అందించాడు.