ఏపీ రాజధాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్

ఏపీ రాజధాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సింగపూర్

ఏపీ రాజధాని అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందం నుంచి సింగపూర్ కంపెనీ తప్పుకుంది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్  ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు రావడంతో ప్రాజెక్టు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సింగపూర్ ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లొ సింగపూర్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. అయితే  ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు మంత్రి ఈశ్వరన్.