శాడిస్టిక్ సమాజంలో ఉంటున్నాం.. సమంత ట్రోలింగ్స్పై స్పందించిన చిన్మయి

శాడిస్టిక్ సమాజంలో ఉంటున్నాం.. సమంత ట్రోలింగ్స్పై స్పందించిన చిన్మయి

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi). సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులే పడుతున్నాయి. అయితే ఒక సెక్షన్ వారు మాత్రం విజయ్, సమంత మధ్య వచ్చే సీన్స్ గురించి నెగిటీవ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సమంతపై తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్ళై విడాకులు తీసుకున్న అమ్మాయి ఇలా లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఏంటి? అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ కామెంట్స్ కాస్త ఎక్కువడంతో వాటిపై ప్రముఖ గాయని, సమంత స్నేహితురాలు చిన్మయి స్పదించారు.  ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘమైన నోట్ రాశారు.    

సమంత. తనను ఎవరు ఎన్ని మాటలు అంటున్నా.. అవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ లైఫ్ లో ముందుకు సాగుతోంది. ఇక ఆమె పనైపోయింది, ఆమెకు కెరీర్ లేదు అన్న ప్రతిసారి తన కష్టంతోనే సమాధానం ఇచ్చింది. ఈక్రమంలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ తనదైన ముద్ర వేసింది. ఇక మగజాతి ఆణిముత్యం అని చెప్పుకొనే చాలా మంది ఈ నిజాన్ని గమనించలేక చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మీ ఇంట్లో ఉంటే వారిని కాస్త దూరం పెట్టండి. డబ్బులు సంపాదించే క్రమంలో ఒకర్ని ఇలా దూషిస్తున్నా, ఏమి మాట్లాడకుండా అలా దూషించే వాళ్లకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి వారి నుంచి కూడా డబ్బు సందించుకునే శాడిస్టిక్ పొజిషన్ లో ఉంది ప్రస్తుత సమాజం. అయితే కర్మ ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. సమయం వచ్చినప్పుడు ఎవరది వారికీ తిరిగి ఇచ్చేస్తుంది అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి రాసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.