
సినిమాపై ఉన్న ప్యాషన్ తో ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే కోరికతో ఉత్తరాంధ్రలో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి.. సినిమాలపై అవగాహన పెంచుకుని నిర్మాణ రంగంలోకి దిగి.. హీరో ధనుష్ తో ధర్మయోగి సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయం అందుకొన్నాడు నిర్మాత సి. హెచ్ సతీష్ కుమార్. ఆ తర్వాత బూమారంగ్, లోకల్ బాయ్స్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుని.. ఇప్పుడు తన సొంత బ్యానర్ విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మించిన తమిళ సినిమా "యానై"ను తెలుగులో "ఏనుగు" పేరుతో విడుదల చేస్తున్నారు. హీరో సూర్య తో సింగం సిరీస్, విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి.ఈ సినిమా దర్శకత్వం వహించడం విశేషం.ఈ చిత్రంలో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, అమ్ము అభిరామి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సాంకేతిక నిపుణులు
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: హరి, ప్రొడక్షన్ హౌస్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్, నిర్మాతలు: సీహెచ్ సతీష్ కుమార్, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్, సంగీతం - జి.వి. ప్రకాష్ కుమార్, DOP - గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ - మైఖేల్ B.F.A., ఎడిటర్ - ఆంథోని, సాహిత్యం - స్టంట్స్ - అన్ల్ అరసు, సహ దర్శకుడు: N. జాన్ ఆల్బర్ట్ , కొరియోగ్రఫీ - బాబా బాస్కర్, ధీనా , DI, VFX & సౌండ్ డిజైన్ - నాక్ స్టూడియోస్, సౌండ్ మిక్స్ - టి. ఉదయ కుమార్ , చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ - మునియరాజ్ , కాస్ట్యూమర్ - రంగసామి , స్టిల్స్ - శరవణన్ , కాస్ట్యూమ్ డిజైనర్ - నివేదా జోసెఫ్, గీతు , PRO - నాయుడు - ఫణి