ఫోన్ ట్యాపింగ్ కేసులో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి సిట్ నోటీసులు

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి మంగళవారం (మే 19) సిట్ నోటీసులు జారీ చేసింది. బుధవారం (మే 20) ఉదయం 11 గంటలకు బషీర్ బాగ్ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించిన సిట్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుతో సహా పలువురు రాజకీయ నాయకులు, అధికారులను సిట్ విచారించింది. దాదాపు ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది.