మల్కాజి గిరిలో ఐదు కీలక సైబర్ కేసుల్లో..ఆరుగురు నిందితులు అరెస్ట్

మల్కాజి గిరిలో ఐదు కీలక సైబర్ కేసుల్లో..ఆరుగురు నిందితులు అరెస్ట్

మల్కాజిగిరి, వెలుగు: సైబర్ మోసాలపై ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఐదు కీలక కేసుల్లో ఆరుగురు నిందితులను మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు రూ.6.80 లక్షల నగదును తిరిగి ఇప్పించారు. 

అరెస్టయిన వారిలో జర్మనీలో ఉద్యోగాల పేరిట రూ.5.39 లక్షలు వసూలు చేసిన సూర్యాపేట జిల్లా మునగాల మండలానికి చెందిన కాసాని సతీశ్.. ఆర్మీ ఆఫీసర్​గా నటించి ఇల్లు అద్దె పేరిట రూ.2.75 లక్షలు కాజేసిన పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇందారపు నవీన్.. నకిలీ స్టాక్ ట్రేడింగ్ ద్వారా రూ.26.50 లక్షలు మోసం చేసిన హైదరాబాద్​కు చెందిన కొమ్ము విష్ణు, మక్కల అరవింద్.. పార్సిల్​లో డ్రగ్స్, విదేశీ కరెన్సీ ఉన్నాయంటూ భయపెట్టి రూ.4.79 లక్షలు వసూలు చేసిన వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్​కు చెందిన పందుల శ్రీకాంత్, ఆర్టీఓ చలాన్ యాప్ ద్వారా వాట్సాప్ హ్యాక్ చేసి రూ.40.08 లక్షలు నొక్కేసిన వనస్థలిపురం విజయపురి కాలనీకి చెందిన నన్నాక రఘునాథ్​ ఉన్నారు. నిందితులంతా భారీ కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇస్తూ ‘మ్యూల్ అకౌంట్ హోల్డర్స్’గా మారారని పోలీసులు తెలిపారు.