గుజరాత్ సీఎం రేసులో ఆరుగురు నేతలు

గుజరాత్ సీఎం రేసులో ఆరుగురు నేతలు

అహ్మదాబాద్: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సడెన్​గా రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రేసులో చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, పరుషోత్తమ్ రూపాలా, స్టేట్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీజేపీ స్టేట్ చీఫ్ సీఆర్ పాటిల్, పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గోర్ధన్ జడాఫియా, రాష్ట్ర మంత్రి ఆర్ సీ ఫాల్దూ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో మాండవీయ, నితిన్ పటేల్, సీఆర్ పాటిల్ రేసులో ముందున్నట్లు సమాచారం. మాండవీయ, రూపాలా ఇద్దరూ గుజరాత్ నుంచే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. సీఆర్ పాటిల్ లోక్ సభ ఎంపీ కాగా.. ఆర్ సీ ఫాల్దూ స్టేట్ బీజేపీ మాజీ ప్రెసిడెంట్. జడాఫియాకు వీహెచ్ పీతో అనుబంధం ఉంది. నితిన్ పటేల్ రాష్ట్రంలోని బలమైన కమ్యూనిటీ పాటిదార్ వర్గానికి చెందిన నాయకుడు. కాగా, సీఎం ఎంపికపై గాంధీనగర్​లో జరిగిన టాప్ లీడర్ల మీటింగ్​లో మాండవీయ, రూపాలా పాల్గొన్నారు. బీజేపీ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కూడా ఎమ్మెల్యేలతో చర్చించారు.