సోలో ట్రెండ్.. సో.. బెటర్

సోలో ట్రెండ్.. సో.. బెటర్

సోలో లైఫ్‌‌లో..  తమ పనులు తామే చేసుకునేవాళ్లు చాలామంది.  ఈ ఒంటరితనమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌‌గా మారింది. ఒంటరిగా ఉన్నప్పుడు తాము చేసే పనుల్ని.. ఆన్‌‌లైన్‌‌లో ఇతరులతో షేర్‌‌ చేసుకుంటోంది ప్రెజంట్‌‌ జనరేషన్‌‌.  తద్వారా ఆందోళన(యాంగ్జైటీ) నుంచి బయటపడటంతో పాటు.. ఆ లోన్లీనెస్‌‌లోనూ ఒకరకమైన కిక్‌‌ను వెతుక్కుంటోంది. ఆసియా దేశాల్లో మొదలైన #Solo ట్రెండ్.. ఇప్పుడు మిగతా దేశాలకూ విస్తరిస్తోంది. ఇంతకీ ఈ ట్రెండ్‌‌లో ఏం చేస్తారు? ఇందులో ఉన్న రకాలేంటో చూద్దాం.

ముక్‌‌బ్యాంగ్‌‌

కొరియా దేశాలు పదేళ్ల క్రితమే మొదలుపెట్టిన ట్రెండ్ ముక్‌‌బ్యాంగ్‌‌. దీనిని మియోక్‌‌బ్యాంగ్ అని కూడా పిలుస్తారక్కడ. కొరియా భాషలో ‘మియుక్దా’ అంటే ‘తినడం’.. ‘బ్యాంగ్‌‌సాంగ్‌‌’ అంటే ‘బ్రాడ్‌‌కాస్ట్ చేయడం’ అని అర్థం. దక్షిణ కొరియా కల్చర్‌‌లో ‘ఒంటరిగా తినడం’ ఒక ఆనవాయితీగా ఉంది. అయితే దానికి బ్రాడ్‌‌క్యాస్ట్(ప్రసారం చేయడం) ద్వారా కొత్తదనం తీసుకొచ్చింది అక్కడి యువత. దీనిని ‘ఈట్‌‌క్యాస్టింగ్‌‌’ అని పిలుచుకుంటున్నారు వాళ్లు. దీని ప్రకారం ఎక్కువ మోతాదు(క్వాంటిటీ)లో ఫుడ్ తీసుకుంటూ.. ఆ వీడియోని సోషల్ మీడియా అకౌంట్స్‌‌లో లైవ్‌‌ స్ట్రీమ్‌‌ చేస్తుంటారు.  లేదంటే ఆఫ్‌‌లైన్ వీడియోల్ని పోస్ట్ చేస్తారు. తద్వారా వాళ్ల ఒంటరితనాన్ని ఇతరులతో షేర్‌‌ చేసుకుని రిలీఫ్‌‌ పొందుతారన్నమాట. అయితే సియోల్‌‌ ఆఫీస్‌‌ కల్చర్‌‌లో ముక్‌‌బ్యాంగ్ ట్రెండ్ విస్తరించడంతో నెమ్మదిగా అది యూరప్ దేశాలకు పాకింది.  అంతేకాదు మనదగ్గరా ఇలాంటి ట్రెండ్‌‌ని కొందరు ఫాలో అవుతున్నారు. మణిపురి యూట్యూబర్స్‌‌ కెబోలా వహెంగ్‌‌బమ్‌‌, అపెయ్‌‌ ఒపాలిక్‌‌ లాంటి వాళ్లు సోలో ఈటింగ్‌‌తోనే పాపులర్ అయ్యారు.

ఒహిటోరిసామా

జపనీస్‌‌‌‌ పదం. దీనికి అర్థం ‘వన్ పర్సన్’ అని. ఆన్‌‌‌‌ యువర్‌‌‌‌ ఓన్‌‌‌‌ అని కూడా పిలుస్తారు.  ఒంటరిగా ఉన్నవాళ్లు తమ జాలీ మూమెంట్స్‌‌‌‌ను షేర్‌‌‌‌ చేసుకునే ట్రెండ్ ఇది. తినడం, తాగడం, పాటలు పాడటం, టూర్లు వేయడం..  ఇలా ఏ అకేషన్‌‌‌‌ అయినా ఆ పోస్టులను సోషల్ మీడియాలో షేర్‌‌‌‌ చేసుకోవడం ఒహిటోరిసామా ప్రత్యేకత. సోలో ట్రావెలర్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ ద్వారా ఈ ట్రెండీ కల్చర్‌‌‌‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.  సింగిల్‌‌‌‌హుడ్‌‌‌‌.. అంటే ఒంటరిగా ఉంటూ కూడా ఎంజాయ్‌‌‌‌ చేస్తున్నామనే సంకేతాలిస్తూ.. తమ ఒంటరితనాన్ని దూరం చేసుకునే ప్రయత్నమే ఈ ట్రెండ్‌‌‌‌ ఉద్దేశం.

బెంక్యూ డౌగా..

ఇది జపనీస్‌‌ పదం. దీనర్థం ‘స్టడీ క్లిప్స్‌‌’.  ఒంటరిగా చదివేందుకు బద్ధకించే వాళ్లు బెంక్యూ డౌగా బాగా పనికొస్తుంది. ఈ ట్రెండ్‌‌లో ఒంటరిగా ఉండే వ్యక్తి.. వీడియో సైట్‌‌కి లాగిన్‌‌ కావాలి. అక్కడ వేల మంది అతని లాంటోళ్లే ఉంటారు. వాళ్లంతా సైలెంట్‌‌గా చదువుకుంటూ ఉంటారు. వాళ్లను ఇనిస్పిరేషన్‌‌గా తీసుకుని.. ఇతగాడు కూడా చదవడం ప్రారంభిస్తాడు. అంటే స్టడీలో ఒక కంపెనీ కోసం ఈ ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఆ ఆడియెన్స్‌‌లో ఉన్న చాలామంది ఒపీనియన్‌‌ కూడా ఇదే. లోన్లీనెస్‌‌లో ఉంటూనే ఈ రకంగా సోషలైజ్‌‌ అవుతోంది యువత. అయితే ఇందులో గంటల తరబడి చదువు మీదే సాగుతుంది. మధ్యలో కెమెరాను గదిలో తిప్పి చూపించడం.. లేదంటే స్లో మ్యూజిక్‌‌ని ప్లే చేయడం ద్వారా రిలాక్స్ అవుతారు. అలాగని ఈ ట్రెండ్‌‌ని టైంపాస్‌‌గా తీసుకోవట్లేదు. ‘ఒంటరిగా ఉన్నాం’ అనే ధ్యాస నుంచి బయటపడి.. తమ చదువు కొనసాగించుకునేందుకు ఉపయోగపడుతోంది.

కొరియాలో ఇదే ట్రెండ్‌‌ను ‘గోంగ్‌‌బ్యాంగ్‌‌’ అంటారు. ‘గోంగ్‌‌బు’ అంటే ‘స్టడీ’ అని మీనింగ్‌‌. కానీ, ఇక్కడి ట్రెండ్‌‌లో వీడియో బ్రాడ్‌‌క్యాస్టర్స్‌‌ సైట్లకు కామెంట్‌‌ సెక్షన్‌‌ ఆఫ్షన్‌‌ జోడించారు. కామెంట్ల ద్వారా ఒకరిని ఒకరు ఎంకరేజ్‌‌ చేసుకుని చదువు కొనసాగిస్తుంటారు. మొత్తానికి ఈ స్టడీ క్లిప్స్‌‌ ట్రెండ్‌‌.. యంగ్‌‌స్టర్స్‌‌ని చదివేలా ప్రేరేపిస్తోంది. క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు యాంగ్జైటీని దూరం చేస్తోంది.