TRS పార్టీకి సోమారపు సత్యనారాయణ రాజీనామా

TRS పార్టీకి సోమారపు సత్యనారాయణ రాజీనామా

ఆర్టీసీ మాజీ ఛైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గౌరవం లేనప్పుడు కలిసి పని చేయడం అసాధ్యమన్న సోమారపు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆరోపించారు.

కేసీఆర్ అడగకుండానే ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారన్న సత్యనారాయణ..కొందరివల్ల పార్టీలో ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. 2009లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ పార్టీనుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో… ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొందక ముందు రామగుండం మున్సిపల్ ఛైర్మన్ గా కూడా పని చేశారు.