తన నాయకత్వంలో టీమిండియాను ఉన్నత శిఖరాలకు చేర్చిన సౌరవ్ గంగూలీ… బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. BCCI అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన క్రికెటర్లలో రెండో వ్యక్తిగా గంగూలీ. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా BCCI కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్. గంగూలీతో పాటు వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.
సౌరవ్ గంగూలీకి ఎంతో టాలెంట్ ఉందని, భారత క్రికెట్‌కు ఇది ఎంతో గర్వించదగిన క్షణమన్నారు IPL మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా.


