లాడ్జీల ఓనర్లు రూల్స్ పాటించాలి : భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు

లాడ్జీల ఓనర్లు రూల్స్ పాటించాలి : భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని లాడ్జీల యజమానులంతా నిబంధనలను పాటించాలని భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు ఆదేశించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్​లో జిల్లాలోని లాడ్జీల యజమానులతో శనివారం సమావేశం నిర్వహించారు. లాడ్జీకి వచ్చే వారి పూర్తి వివరాలను రిజిస్టర్​లో నమోదు చేయాలని, ప్రభుత్వ ఐడీ కార్డును తీసుకోవాలన్నారు. 

విదేశీయులు లాడ్జీలో బస చేస్తే వారి వివరాలను ఆన్​లైన్​లో సమాచారం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,  అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు. పోలీస్​స్టేషన్ల ఫోన్​ నంబర్లను రిసెప్షన్​ వద్ద పొందుపర్చాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.