హైదరాబాద్ : బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో సంచలన తీర్పు చెప్పింది పోక్సో స్పెషల్ కోర్టు. ఈ కేసులో దోషిగా తేలిన కానిస్టేబుల్ కు 30ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధిత మైనర్ కు లక్ష రూపాలయ పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ సిటీ పరిధిలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన మైనర్ పై కానిస్టేబుల్ అత్యాచారం కేసులో శుక్రవారం (మే15) పోక్సో స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్ వరదరాజ్ సుదేశ్ ను పై నమోదు అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో ప్రత్యేకకోర్టు వెల్లడించింది. కానిస్టేబుల్ వరదరాజ్ సుదేశ్ కు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ12వేల జరిమానా విధించింది. బాధితురాలికి 1లక్ష రూపాయలు పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
