కాశీ, పూరి యాత్రలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు : కుషాయి గూడ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్

కాశీ, పూరి యాత్రలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు : కుషాయి గూడ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్
  • ఈ నెల 28, 30 తేదీల్లో కుషాయిగూడ నుంచి ప్రారంభం

మల్కాజిగిరి, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాశీ, పూరి యాత్రలకు కుషాయిగూడ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే కాశీ యాత్ర 7 రోజులపాటు కొనసాగనుండగా.. ఇందులో మయ్యర్, ప్రయాగ్‌‌‌‌రాజ్, వారణాసి, అయోధ్య, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ తదితర పుణ్యక్షేత్రాల దర్శనం కల్పించనున్నారు. 

ఈ యాత్రకు టికెట్ ధరను రూ.8,000గా నిర్ణయించారు. అలాగే, ఈ నెల 30న బయలుదేరే పూరి యాత్ర 6 రోజులపాటు సాగనుండగా.. ఈ యాత్రలో మొత్తం తొమ్మిది పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుందని, దీని టికెట్ ధర రూ.6,500గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ యాత్రలలో భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని, ముందస్తు రిజర్వేషన్ కోసం భక్తులు 9603549388, 9959226145 నంబర్లలో సంప్రదించాలని కోరారు.