కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం...బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులకు గాయాలు

కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం...బైక్ ను ఢీకొనడంతో  ఇద్దరు ఐటీ ఉద్యోగులకు గాయాలు

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లోని కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వైపు నలుగురు యువకులతో వేగంగా వెళ్తున్న బెలినో కారు.. ముందు వెళ్తున్న బైక్​ను బలంగా ఢీకొట్టింది. ఆపై డివైడర్​ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో అప్పుడే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఐటీ ఉద్యోగులు విఘ్నేశ్, భవిష్య తీవ్రంగా గాయపడ్డారు. 

ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులోని వారు సేఫ్​గా బయటపడ్డారు.  కారు నడుపుతున్న ఎండీ ఖాజా సోఫియుద్దీన్​ను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి పిలవడంతో ఒక్కసారిగా వెనక్కి చూడటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం బాధితులిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.