ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ పై నిద్రిస్తున్న వారి పైనుంచి ట్రక్కు దూసుకెళ్లి నలుగురు చనిపోయారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సీమాపురి డీటీసీ డిపో దగ్గర రెడ్ లైట్ పడింది. అయితే దాన్ని పట్టించుకోకుండా వేగంగా వెళ్లిన లారీ.. అదుపుతప్పి రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారి మీదనుంచి వెళ్లింది. దీంతో స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. మరొకరు హాస్పిటల్ తరలిస్తుండగా.. ఇంకొకరు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. లారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు .
