వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఎంత పని చేశాడో చూడండి.. పాపం ఈ కుర్రాడు..

వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ఎంత పని చేశాడో చూడండి.. పాపం ఈ కుర్రాడు..

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వాటర్ ట్యాంకర్ అతివేగంగా దూసుకెళ్లి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన అదే ట్యాంకర్ మరో కారు, స్కూటీని కూడా ఢీ కొట్టింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

హఫీజ్‌పేట్‌లో పని ముగించుకుని లక్ష్మిగూడకు వెళ్తున్న సుశీల్ కుమార్, సురేష్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న 28 ఏళ్ల సుశీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు.

ALSO READ : అత్తాపూర్‌‌లో 8.41 కేజీల గంజాయి స్వాధీనం..

ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆగకుండా వెళ్లిన ట్యాంకర్ మరో కారు, స్కూటీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. సిటీ శివారు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ ఎక్కువగా అవసరం పడటం, వాటర్ ట్యాంకర్ డ్రైవర్లకు టార్గెట్ బట్టి డబ్బులు రావడంతో డ్రైవర్లు ఇలా స్పీడ్గా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు వాపోయారు.