స్పైస్‌జెట్ విమానంలో మ‌రోసారి సాంకేతికలోపం

స్పైస్‌జెట్ విమానంలో మ‌రోసారి సాంకేతికలోపం

స్పైస్‌జెట్‌ విమానంలో వరుసగా సమస్యలు తలెత్తుతోనే ఉన్నాయి.  ఇది ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.  తాజాగా మరోసారి స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దుబాయి నుంచి మదురై వెళ్లే విమానం  ఆలస్యంగా బయలుదేరింది. VT-SZK రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బోయింగ్ B737 మ్యాక్స్ విమానం మంగళూరు నుంచి దుబాయికి ప్రయాణించింది. ఆ విమానం ల్యాండ్‌ కాగానే ఇంజినీర్‌ తనిఖీ చేయగా.. నోస్‌ వీల్‌లో లోపం ఉన్నట్టుగా గుర్తించారు. దీనితో  స్పైస్‌జెట్‌ తిరిగి దుబాయి-మదురై వెళ్లే ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ముంబయి నుంచి దుబాయికి పంపింది. సాంకేతిక సమస్య వల్లే  అలస్యం అయినట్లుగా స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది.  స్పైస్‌జెట్‌ సాంకేతిక లోపాలు తలెత్తడం గత 24 రోజుల్లో ఇది తొమ్మిదో సారి కాగా,   ఇందులో మూడు ఘటనలు ఈ నెల(జులై) 5నే చోటుచేసుకున్నాయి.