స్పోర్ట్స్‌ కూడా ఎడ్యుకేషన్‌లో భాగమే

స్పోర్ట్స్‌ కూడా ఎడ్యుకేషన్‌లో భాగమే

ముంబై: కంట్రీ న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీలో స్పోర్ట్స్‌ కూడా పాఠ్యాంశాల్లో భాగంగానే ఉంటుందని సెంట్రల్‌ స్పోర్ట్స్ మినిస్టర్‌‌ కిరణ్‌ రిజిజు అన్నారు. ఇక నుంచి స్పోర్ట్స్ ను ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా పరిగణించబోమన్నారు. ‘దేశంలో కొత్త విద్యా చట్టాలను అమలు చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగా క్రీడలు కూడా విద్యలోనే ఉంటాయి. ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్ వేర్వేరు కావనేది నా నమ్మకం. ఈ రెండు సేమ్‌. స్పోర్ట్స్ ను ఆప్షనల్‌ సబ్జెక్ట్‌‌గా ట్రీట్‌ చేయొద్దు. ఎడ్యుకేషన్‌‌లో భాగంగానే దానిని ఆమోదించాలి. ఎడ్యుకేషన్‌ పాలసీని అధికారికంగా ఇంకా డిక్లేర్‌‌ చేయలేదు. కానీ ఇది ఫైనల్‌ షేప్‌కు వచ్చింది. ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌‌లో భాగంగానే స్పోర్ట్స్‌ ఉండాలని నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్పా. నేషనల్‌ కమిటీతో జరిగిన మా ఇంటర్నల్‌ మీటింగ్‌‌లోనూ దీనిపై అనేకసార్లు చర్చించాం’ అని రిజిజు పేర్కొన్నారు. నేషనల్‌ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్‌ బోర్డును రూపొందించేందుకు ఓ హై లెవల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోర్డు ఏర్పాటులో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఈ కమిటీ చర్చిస్తుందన్నారు.

For More News..

మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్?

ఏనుగులకు 5 కోట్ల ఆస్తి రాసిచ్చిన జంతు ప్రేమికుడు

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్