శ్రీలీల రాంగ్​స్టెప్​? ఎక్కడో తెలుసా!

శ్రీలీల రాంగ్​స్టెప్​? ఎక్కడో తెలుసా!

టాలీవుడ్​ హీరోయిన్​ శ్రీలీల(Sreeleela) స్కంద మూవీతో ఇవాళ(సెప్టెంబర్ 28న)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటిలాగే ఆమె డ్యాన్సులు, క్యూట్​ లుక్స్​కి మంచి రెస్పాన్స్​ వస్తోంది. అయితే, ఈ హీరోయిన్​ ఫ్యాన్స్​ను ఓ విషయం కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్న సినిమాలన్నీ మాస్​ మసాలా నేపథ్యంలో సాగేవే. బాలయ్యతో భగవంత్​ కేసరి, నితిన్​తో ఎక్స్​ట్రార్డనరీ మ్యాన్​, పవన్​ కల్యాణ్​ ఉస్తాద్​ భగత్ సింగ్​.. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.

కమర్షియల్​ సినిమాల్లో హీరోయిన్ల అందాల ఆరబోతకు తప్ప నటనకు ప్రాధాన్యం ఉండదన్న విషయం తెలిసిందే. గతంలో పలువురు హీరోయిన్స్​ కూడా ఇలాంటి సినిమాలు చేసి గ్లామర్​ డాల్​ ముద్రవేసుకున్నారు. ఆ తర్వాత తెరమరుగయ్యారు. మరి శ్రీలీల ఏం చేస్తుందోనని ఫ్యాన్స్​ టెన్షన్​ పడుతున్నారట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఇక ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దాదాపు 10 మూవీస్ లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. అక్టోబర్ లో భగవంత్ కేసరి, నవంబర్‌లో ఆదికేశవ లో కనిపిస్తుంది.అలాగే జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా దాదాపు 10 చిత్రాల తర్వాత..

ప్రభాస్ తో మరో భారీ చిత్రానికి సైన్ చేసింది. ఇది ప్రేమ కథ కావడం ప్లస్.. 

ఈ స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్.  అలాగే దసరా స్పెషల్గా ఈ మూవీకి సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ  హను ఫ్యాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.