హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ 2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఆదివారం విడుదలైన రిజల్ట్స్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో శ్రీచైతన్య విద్యార్థులు టాప్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు. ఇంజినీరింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా రెండు విభాగాల్లో కలిపి టాప్ 10లో ఏకంగా 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారని ఆ విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు.
టాప్ 100 ర్యాంకుల జాబితాలో ఏకంగా 93 ర్యాంకులు శ్రీచైతన్య విద్యార్థులకు లభించాయని చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో 3వ ర్యాంక్ (ఎం. వంశీధర్ రెడ్డి), 4వ ర్యాంక్ (జె.రోషన్ మణిదీప్ రెడ్డి), 9వ ర్యాంక్ (బి.సమీరాజ్ రెడ్డి) సాధించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌లోనూ 3వ ర్యాంక్ (జి. సాహితి గీతిక), 5వ ర్యాంక్ (అమైర్ అనస్), 6వ ర్యాంక్ (నాథన్ షీబా జెరూషా), 7వ ర్యాంక్ (పి.అనురాగ్), 8వ ర్యాంక్ (బి.సాయిశరణ్), 9వ ర్యాంక్ (ఎం. మారుతి సత్య శ్రీకర్), 10వ ర్యాంక్ (రుతుంబిక మొహంతి) దక్కించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఘనత ఒక్క శ్రీచైతన్యకే దక్కిందని సుష్మ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, నిరంతర టెస్టులు, నిపుణులైన అధ్యాపక బృందం పర్యవేక్షణే ఈ విజయానికి కీలకమని ఆమె పేర్కొన్నారు.
