ఆధారాల్లేవ్.. ఫిక్సింగ్‌ కథ ఖతం

ఆధారాల్లేవ్.. ఫిక్సింగ్‌ కథ ఖతం

కొలంబో: ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే వరల్డ్​ ఫైనల్‌‌‌‌ ఫిక్స్‌‌‌‌ అయిందన్న ఆరోపణలకు చెక్‌‌‌‌ పడింది. ఫిక్సింగ్​ఆరోపణలపై శ్రీలంక స్పోర్ట్స్ మినిస్ట్రీ చేపట్టిన విచారణ ముగిసింది. కుమార సంగక్కర, ఉపుల్ తరంగ, అరవింద డిసిల్వను ప్రశ్నించిన స్పెషల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ టీమ్‌‌‌‌.. ఫైనల్​ మ్యాచ్​ రిజల్ట్​ విషయంలో అవినీతి జరిగింది అనేందుకు తగిన ఆధారాలు లేవని తేల్చింది. దీంతో ఈ అంశంపై విచారణను ఆపేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ మ్యాచ్‌‌‌‌ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేయడానికి తావే లేదని ఐసీసీ యాంటీ కరప్షన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ కూడా స్పష్టం చేసింది. దాంతో, ఇండియా విజేతగా నిలిచిన ఈ మ్యాచ్‌‌‌‌ క్లీన్‌‌‌‌గా సాగిందని స్పష్టమైంది.

తమ జట్టు వన్డే వరల్డ్​కప్​ను ఇండియాకు అమ్మేసుకుందని శ్రీలంక మాజీ స్పోర్ట్స్ ​మినిస్టర్​ మహిదానంద అల్తుగమగే కొద్దిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. వీటిని సీరియస్​గా తీసుకున్న లంక స్పోర్ట్స్​ మినిస్ట్రీ ప్రత్యేక దర్యాపు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. కుమార సంగక్కర (వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌), అరవింద డిసిల్వ (చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌), ఉపుల్‌‌‌‌ తరంగ (ఓపెనర్‌‌‌‌)కు దర్యాప్తు బృందం సమన్లు జారీ చేసింది. అనంతరం ముగ్గురినీ తలో నాలుగు గంటల పాటు విచారించింది. నాటి ఫైనల్లో సెంచరీ చేసిన మహేల జయవర్దనెను కూడా ప్రశ్నించాలనుకుంది. శుక్రవారం తమ కార్యాలయానికి వచ్చిన మహేలను విచారించే ముందే దర్యాప్తును నిలిపివేసింది. సంగ, తరంగ, డిసిల్వ స్టేట్‌‌‌‌మెంట్లను పరిశీలించిన తర్వాత అల్తుగమగే తమ ముందు ఉంచిన 14 పాయింట్లను ధ్రువీకరించలేమని స్పష్టమైందని ఇన్వెస్టిగేషన్​ టీమ్​ చెప్పింది. ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ తుది జట్టులో చేసిన నాలు గు మార్పులను ఎత్తి చూపిన మహిదానంద.. ఆ మెగా టోర్నీ టీమ్‌‌‌‌ నుంచి సనత్ జయసూర్యను తప్పించడంపై అనుమానం వ్యక్తం చేశారు. కానీ,పేలవ ఫామ్‌‌‌‌ కారణంగా 2009లో జట్టు నుంచి డ్రాప్‌‌‌‌ అయిన జయసూర్య 2011 ఆరంభం వరకూ ఒక్క వన్డే కూడా ఆడలేదు. జయసూర్యను జట్టు నుంచి తప్పించిన విషయమై చీఫ్‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌ డిసిల్వను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ‘ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఎలా సాగిందనే విషయంలో ముగ్గురు చెప్పిన వివరాలు సహేతుకంగా ఉన్నాయి. ముఖ్యంగా జట్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందో వాళ్లు పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే, 2011లో జరిగిన ఇతర విషయాల గురించి చెప్పారు. వాళ్ల వివరణతో మేం సంతృప్తి చెందాం. ఈ విచారణను ఇక్కడితో ముగిస్తున్నాం’ అని ఇన్వెస్టిగేషన్‌‌‌‌ టీమ్‌‌‌‌ హెడ్‌‌‌‌, సీనియర్‌‌‌‌ పోలీసు అధికారి జగత్‌‌‌‌ ఫొన్సెక ప్రకటించారు. అనంతరం ఐసీసీ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా రావడంతో ఈ ఎపిసోడ్‌‌‌‌కు ఎండ్‌‌‌‌ కార్డ్‌‌‌‌ పడినట్టయింది. జరిగిన పరిణామాలు చూస్తుంటే.. జయవర్దనే చెప్పినట్టు త్వరలో జరగబోయే ఎన్నికల్లో లబ్ది పొందేందుకే మహిదానంద ఫిక్సింగ్​ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

విచారణ అనవసరం: ఏసీయూ జీఎం

2011 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ సమగ్రతను ప్రశ్నించడానికి ఎలాంటి కారణం లేదని ఐసీసీ శుక్రవారం ప్రకటిం చింది. ఈ మ్యాచ్‌‌ ఫిక్స్‌‌ అయింద న్న ఆరోపణలను పరిశీలించామ ని, యాంటీ కరప్షన్‌‌ కోడ్ కింద దీనిపై విచారణ చేపట్టేందుకు ఎలాంటి ఆధారం లేదని ఐసీసీ యాంటీ కరప్షన్‌‌ యూనిట్‌‌ (ఏసీయూ) జనరల్‌‌ మేనేజర్‌‌ అలెక్స్‌‌ మార్షల్‌‌ స్పష్టం చేశారు. అలాగే, లంక మాజీ స్పోర్ట్స్‌‌ మిని స్టర్‌‌ అల్తుగమగే నుంచి గతంలో తమకు ఎలాంటి లెటర్‌‌ రాలేద న్నారు. మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌‌ ఆరోపణ లను ఐసీసీ చాలా సీరియస్‌‌గా తీ సుకుంటుందని అలెక్స్‌‌ పునరుద్ఘాటించారు. ఈ మ్యాచ్‌‌తో పాటు మరే గేమ్‌‌లో అయినా ఫిక్సింగ్‌‌ జరిగినట్టు ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే వెంటనే ఐసీసీ ఇంటిగ్రిటీ యూనిట్‌‌నుసంప్రదించాలని సూచించారు.

 కోహ్లీతో పొల్చొద్దు..పాక్ లెజెండ్స్ తో పోల్చండి