బాంబు పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

బాంబు పేలుళ్లపై శ్రీలంక అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

కొలంబో : శ్రీలంక చర్చిల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మారకద్రవ్యాలను అణచివేయాల్సిందేనన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మారక ద్రవ్యాల నేరాలకు మరణ శిక్షే సరైందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పేలుళ్లకు స్థానిక జిహాదీ టెర్రరిస్టు గ్రూపులే కారణమని మొదట్లో పోలీసులు తేల్చారు. తోహిత్ జమాత్ (ఎన్‌టీజే) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్ల దాడిలో దాదాపు 258 మంది మరణించిన సంగతి తెలిసిందే. మొదట్లో సాక్షాత్తూ సిరిసేనాయే ఈ పని ఉగ్రమూకల పని అని తేల్చి చెప్పినా, సోమవారం మాత్రం ఈ పని అంతర్జాతీయ మారకద్రవ్యాల డీలర్ల పనే అని సిరిసేనా తేల్చి చెప్పారు.