శ్రీనగర్ లో దాదాపు 30ఏళ్ల తర్వాత చోటుచేసుకున్న చారిత్రక ఘట్టంపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్ పై అక్కడి పోలీసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. షోపియాన్, పుల్వామాలో సినిమాహాళ్లు ఓపెన్ చేశారు కానీ.. శ్రీనగర్ జామియా మసీదు ఇంకా ఎందుకు మూసే ఉంచారని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అయినా.. మసీదులో ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరారు. LG మనోజ్ సిన్హాను ట్యాగ్ చేస్తూ.. జామియా మసీద్ తెరవాలను ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పై శ్రీనగర్ పోలీసులు ఘాటుగా స్పందించారు. జామియా మసీదు పూర్తిగా తెరిచే ఉంటుందని, కరోనా తర్వాత కేవలం మూడు శుక్రవారాల్లోనే మధ్యాహ్న నమాజ్ వేళల్లోనే మూసివేశారని తెలిపారు. అది కూడా ఉగ్రవాది సమాచారం, శాంతిభద్రతల సమస్యలతోనేనని చెప్పారు. ఆ తర్వాత జామియా అధికారులు ప్రకటించిన ప్రకటన మేరకే తాత్కాలికంగా ఆ పూటకు మూసివేయాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు కొసమెరుపుగా అజ్ఞానానికి సాకు లేదు అని ట్వీట్ చేశారు.
Jamia is fully opened,only on 3 occasions post-covid,it was temporarily shut for friday noon prayers owing to inputs of terror attack /law & order situation.This was after Jamia authorities failed to take responsibility of happenings inside. Staying far is no excuse of ignorance. https://t.co/wqicG3oAr2
— Srinagar Police (@SrinagarPolice) September 20, 2022
ఇదిలా ఉండగా ఒకప్పుడు తీవ్ర ఉగ్రవాదంతో అట్టుడికిపోయిన జమ్ముకశ్మీర్ లో ఇటీవలే సినిమా హాల్స్ ఓపెన్ అయ్యాయి. వీటిని అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. అందులో భాగంగా మొదటి షోగా భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించారు.
