కష్టపడి పనిచేస్తా: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కష్టపడి పనిచేస్తా: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కష్టపడి పనిచేసి….సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సెక్రటరియేట్ లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్తీ మద్యంతో పాటు అక్రమ రవాణా తగ్గిందన్నారు. త్వరలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారన్నారు శ్రీనివాస్ గౌడ్.  గీత కార్మికులకు ఆదాయాన్ని పెంచడానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడాలేని కొత్త పథకాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.