రికార్డు స్థాయిలో శ్రీశైలం హుండీ ఆదాయం.. 30 రోజుల్లో రూ. 7.19 కోట్లు

రికార్డు స్థాయిలో శ్రీశైలం హుండీ ఆదాయం.. 30 రోజుల్లో రూ. 7.19 కోట్లు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఉగాది మహోత్సవాలలో కన్నడ,మహారాష్ట్ర భక్తులతో పాటు ఇతర దేశంలోని ఇతర రాష్ట్రాల భక్తులు మొత్తం 30 రోజులలో భక్తులు కానుకల రూపంలో లభించాయి. శనివారం ఉభయ,పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7 కోట్ల 19 లక్షల 58 వేల 064 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ ఆదాయాన్ని గత 30 రోజులులో భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించారని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. నగదుతో పాటు 122 గ్రాముల 200 మిల్లి గ్రాములు బంగారం,వెండి 6 కేజీల 550  గ్రాములు లభించగా 624 యుఎస్ఏ డాలర్లు,210 యు.ఎ.ఇ దిర్హమ్స్,6 సౌదీరియాల్స్,10 సింగపూర్ డాలర్లు,20 ఇంగ్లాండు పౌండ్స్,14 మలేషియా రింగిట్స్ ,25 ఆస్ట్రేలియా డాలర్లు,70 యూరోలు,1 కువైట్ దినార్,60 కెనడా డాలర్లు,20 న్యూజిలాండ్ డాలర్లను స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. 

పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఈవో శ్రీనివాసరావు,ట్రస్ట్ బోర్డ్ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.