భూములను ఎట్లా అమ్మాలనే దానిపై సర్కార్​ దృష్టి

భూములను ఎట్లా అమ్మాలనే దానిపై సర్కార్​ దృష్టి
  • ప్రపోజల్స్​పెట్టాలని కేబినెట్ ​
  • సబ్​ కమిటీలో నిర్ణయం
  • ఆఫీసర్లతో కేటీఆర్, హరీశ్ భేటీ

హైదరాబాద్, వెలుగు :  గత ప్రభుత్వాల టైమ్ లో లీజుకిచ్చిన భూములను ఎట్లా అమ్మాలనే దానిపై సర్కార్​ దృష్టి సారించింది. నిధుల సమీకరణలో భాగంగా  ఖాళీ భూములతో పాటు వాటిని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. వాటిలో ప్రధానంగా హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైన ఆజామాబాద్ అజ్మాబాద్‌‌ ఇండస్ట్రియల్‌‌ ఏరియా భూములు ఉన్నాయి. నిధుల సమీకరణపై సోమవారం బీఆర్కే భవన్​లో మంత్రులు హరీశ్‌‌ రావు, కేటీఆర్‌‌ ఆధ్వర్యంలో కేబినెట్​ సబ్​ కమిటీ భేటీ అయింది.

ఈ సందర్భంగా ఇప్పటి వరకు అమ్మిన భూములు, వచ్చిన ఆదాయంపై చర్చించారు. మిగిలిన భూములను అమ్మడంతో పాటు పారిశ్రామిక భూములను ఎలా అమ్మాలన్న దానిపై చర్చించారు. ఇప్పటికే అసెంబ్లీలో పాసైన ఇండస్ట్రియల్‌‌ ఏరియా లీజుల రెగ్యులరైజేషన్‌‌ సవరణ యాక్ట్​ ప్రకారం అలాటీస్​కు, ఇతరులకు విక్రయించే భూములపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో పాటు హఫీజ్​పేట్, బాలానగర్​ ఇండస్ర్టీయల్​ భూములనూ అమ్మాలని నిర్ణయించారు.