ఉస్మానియా హాస్పిటల్ లో ఇంజెక్షన్స్ మాయం

ఉస్మానియా హాస్పిటల్ లో ఇంజెక్షన్స్ మాయం

హైదరాబాద్ : ఉస్మానియా హాస్పిటల్ స్టోర్ ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించారు. హార్ట్ సర్జరీ, పెరాలసిస్ కు ఉపయోగించే ఇంజెక్షన్స్ మాయం చేశారు.  స్టాక్ లో తేడాలు గుర్తించిన ఉన్నతాధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. స్టోర్ లో పనిచేసే సిబ్బంది ఇంట్లో ఇంజెక్షన్ వయల్స్ స్వాధీనం చేసుకున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్ ను హాస్పిటల్ కమిటీ,  పోలీసులు విచారిస్తున్నారు.