రహస్య ప్రేమికులు ఎవరు? వాలంటైన్స్ డే వేళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మీమ్స్ వీడియోల వార్..

రహస్య ప్రేమికులు ఎవరు? వాలంటైన్స్ డే వేళ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మీమ్స్ వీడియోల వార్..

మున్సిపల్ ఎన్నికల వేళ విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎక్కడైనా లవర్స్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు కానీ.. తెలంగాణలో మాత్రం పార్టీలు విషెస్ చెప్పుకుంటున్నాయి. మరో 48 గంటల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ తరహా పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వా లటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు.

కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయని చెప్పారు. కాంగ్రెస్ సోషల్ మీడియా మరో అడుగు ముందుకేసి కమలం, గులాబీ పువ్వు లవ్వాడుకుంటున్నట్టు వీడియోను క్రియేట్ చేసి హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏకంగా కాంగ్రెస్, బీజేపీ లవర్స్ అంటూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. 'తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా రహస్య ప్రేమికులుగా ఉంటూ వస్తున్న బీజేపీ కాంగ్రెస్లకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు ! 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్ ను బీజేపీ ప్రశ్నించదు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బీజేపీని కాంగ్రెస్ నిలదీయదు. ఇది కదా అసలైన 'ఫెవికాల్' బంధం' అంటూ రాసుకొచ్చింది.