వీధి కుక్క దాడి.. తెగిన వేలు

వీధి కుక్క దాడి.. తెగిన వేలు

పర్వతగిరి, వెలుగు: వీధి కుక్క దాడి చేయడంతో ఓ వ్యక్తి వేలు తెగిపోయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చిరుత సతీశ్​ క్రషర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఇంటి వద్ద స్నానం చేసేందుకు నీళ్లు పోసుకుంటుండగా వీధి కుక్క ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి అతనిపై దాడి చేసింది. కుక్కను తప్పించుకునేందుకు సతీశ్​ చేతులతో నెట్టే ప్రయత్నం చేయగా, కుక్క అతని ఎడమచేతి ఉంగరం వేలిని బలంగా కొరకడంతో అది తెగి కిందపడింది.

కుడిచేతికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. తెగిపోయిన వేలు అతికించడం సాధ్యం కాదని చెప్పిన డాక్టర్లు.. ప్రథమ చికిత్స చేసి ఇంటింటి పంపించారు. ఇదే కుక్క రెండు రోజుల క్రితం బూర్గుమడ్లలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు.