నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC limited) అసిస్టెంట్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 5లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: అసిస్టెంట్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్).
మొత్తం ఖాళీలు: 15 (అన్ రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1).
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, అడ్వర్టైజింగ్ అండ్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్‌లో రెండేళ్ల ఫుల్‌టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు నిర్దేశిత విద్యార్హతల్లో కనీసం 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
వయసు: 29 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 5.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ వేర్వేరుగా కచ్చితంగా అర్హత సాధించాలి. ఆన్‌లైన్ రాత పరీక్షలో సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే రెండు భాగాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ రెండు విభాగాల్లోనూ విడివిడిగా కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
వెయిటేజీ: ఆన్‌లైన్ రాత పరీక్షకు 85 శాతం, ఇంటర్వ్యూ కు15 శాతం వెయిటేజీ కేటాయించారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.ntpc.co.inను సందర్శించండి.
