వామ్మో.. ఇలా ఎలా తీశారు సామీ.. ఈ సినిమా చూస్తే భయంతో నైట్ నిద్ర కూడా పట్టదు..!

వామ్మో.. ఇలా ఎలా తీశారు సామీ.. ఈ సినిమా చూస్తే భయంతో నైట్ నిద్ర కూడా పట్టదు..!

ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా?

టైటిల్ : డార్క్

డైరెక్షన్ : కళ్యాణ్ కె. జగన్

కాస్ట్ : అజయ్ కార్తీ, అంచన నేత్రున్, నట్టి సుబ్రమణియన్, కె. భాగ్యరాజ్, వీటీవీ గణేశ్

ప్లాట్​ఫాం : అమెజాన్ ప్రైమ్

విఘ్నేశ్‌ (అజయ్‌ కార్తీ) ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చి, అతి తక్కువ అద్దెకు కరుణాకర్‌ (భాగ్యరాజా) ఇంటి డాబా పైపోర్షన్‌లో దిగుతాడు. గతంలో అక్కడ ముగ్గురు యువకులు ఉండేవారని, జీవా అనే వ్యక్తి సతీశ్‌, మోహన్‌లను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని కరుణాకర్‌ చెప్తాడు. ఆ తర్వాత వచ్చిన ఇద్దరూ కూడా దెయ్యాల భయంతో వెళ్లిపోయారని, తాను ఆ పోర్షన్‌ను అద్దెకు ఇచ్చి ఈ భయాన్ని తొలగించి ఇంటిని అమ్ముకోవాలని చూస్తున్నానని అంటాడు.

విఘ్నేశ్‌ అక్కడ ఉండడం మొదలుపెట్టిన తర్వాత రాత్రిళ్లు టీవీ దానంతట అదే ఆన్‌ అవడం, దోశ పెనం, పుస్తకం ఎగిరిపడటం మొదలవుతాయి. వాటిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు. కరుణాకర్‌ కూతురు కూడా ఎప్పుడూ దిగులుగా కనిపించడం విఘ్నేశ్‌కు అనుమానం కలిగిస్తుంది. అసలు ఆ ముగ్గురు యువకులు ఎందుకు చనిపోయారు? ఆ ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? విఘ్నేశ్‌ అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డాడా? అనేదే మిగతా కథ.

టైటిల్: రామ్ అండ్ లీల

డైరెక్షన్: రామచంద్రన్ కణ్ణన్

కాస్ట్: రియో రాజ్, వర్తిక జైన్, బాలాజీ తియగరాజన్, మునీష్​కాంత్, మాళవిక అవినాశ్

ప్లాట్​ఫాం: అమెజాన్ ప్రైమ్

రఘురామ్‌ (రియో రాజ్‌) మిడిల్‌ క్లాస్‌ యువకుడు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసే తండ్రితో మాటలు లేకపోయినా.. తల్లి, చెల్లి మధ్యవర్తిత్వంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాకపోవడంతో, అమ్మాయిల నుంచి వరుసగా తిరస్కారాలు ఎదురవుతుండటంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ లోకల్‌ ట్రైన్‌లో లీల (వర్తిక జైన్‌)ను చూస్తాడు.  

చూడగానే ప్రేమలో పడిన రామ్, ఆమె కోసం రోజూ ట్రైన్​లో ప్రయాణిస్తాడు. ఒకరోజు ఆ అమ్మాయి స్వయంగా పరిచయం చేసుకుని,  సాయంత్రం 6 గంటల తర్వాత తనను కలవకూడదనే షరతుతో ఆమె ప్రేమను అంగీకరిస్తుంది. ఒకరోజు ఈ షరతుకు కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడామె తన పూర్వీకుల గురించి చెప్తుంది. నిజం తెలిసిన మరుక్షణం రఘురామ్ ఆమెను చూసి భయపడతాడు. ఇంతకీ ఆ నిజమేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మిగతా కథ.