టమాటాలతో శాంటా క్లాజ్...సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపకల్పన

టమాటాలతో శాంటా క్లాజ్...సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపకల్పన

ప్రముఖ చిత్ర కళాకారుడు,  సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ భారీ శాంటాక్లాజ్‌ను రూపొందించారు. ఒడిశాలోని గోపాల్‌పుర్ బీచ్‌లో టమాటాలు, ఇసుకతో  భారీ శాంటాక్లాజ్‌ను తయారు చేశారు. శాంటా క్లాజ్ రూపకల్పనకు 1.5 టన్నుల టమాటాలను వినియోగించారు. 

https://twitter.com/sudarsansand/status/1606837281993940992

టమాటాలతో కూడిన ఈ సైకత శిల్పాన్ని 27 అడుగుల ఎత్తులో 60 అడుగుల వెడల్పుతో రూపొందించారు. శాంటా క్లాజ్ రూపకల్పనలో సుదర్శన్ పట్నాయక్కు విద్యార్థులు సాయం చేశారు. ఈ సందర్బంగా భారీ శాంటాక్లాజ్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.