చెన్నై టెక్ మహీంద్రా క్యాంపస్ లో ఘోర అగ్ని ప్రమాదం : కాలి బూడిద అయిన గోదాం

చెన్నై టెక్ మహీంద్రా క్యాంపస్ లో ఘోర అగ్ని ప్రమాదం : కాలి బూడిద అయిన గోదాం

చెన్నై సిటీలో కలకలం. చెన్నై సిటీ శివార్లలోని ప్రధానమైన ఐటీ కారిడార్ ఏరియా అయిన OMR షోలింగనల్లూరులోని టాప్ ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా క్యాంపస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2026, మే 15వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో.. టెక్ మహీంద్రా క్యాంపస్ లో ఉన్న గోదాం నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. 

కరపాక్కంలోని ఎల్కాట్ కాంప్లెక్స్ వెనక ప్రాంతంలో ఉంది ఈ టెక్ మహీంద్రా క్యాంపస్ గోదాం. ఇందులో ఐటీ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లు చెబుతున్నారు సిబ్బంది. అతి పెద్ద గోదాం కావటం.. అక్కడ వేల సంఖ్యలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండటంతో.. మంటలను అదుపు చేయటం కష్టంగా మారింది. గంట నుంచి ఆగకుండా మంటలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం 100 ఫైర్ ఇంజిన్స్ మంటలను అదుపు చేయటానికి కష్టపడుతున్నారు.

టెక్ మహీంద్రా క్యాంపస్ లో ఉన్న ఈ గోదాం నుంచి మంటలు మొదలైన వెంటనే.. వందల మంది ఉద్యోగులు ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ఉన్న ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగులు సైతం ఆ ప్రాంతాన్ని వదలి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు స్థానికులు. 

ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరూ చనిపోయినట్లు.. గాయపడినట్లు అధికారికంగా ప్రకటించలేదు అధికారులు. ఈ అగ్ని ప్రమాదం తర్వాత ఉద్యోగులు, సిబ్బంది భయాందోళనలో ఉన్నారని.. ప్రమాదానికి కారణాలపై వాళ్లను అడిగి తెలుసుకుంటాం అని వెల్లడించారు అధికారులు.