నవ్వు.. చర్మానికి మంచిది

నవ్వు.. చర్మానికి మంచిది

వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్కిన్ కేర్​ తప్పనిసరి. రెగ్యులర్​గా చర్మానికి క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సీజన్​లో స్కిన్ సాఫ్ట్​గా ఉండేందుకు ఏం చేయాలంటే... 

  •   చర్మం హెల్దీగా ఉండాలంటే బ్యాలెన్స్​డ్​ డైట్​ ముఖ్యం.  ప్రొటీన్లు, మినరల్స్ ఉన్న ఫుడ్, పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం లేతగా ఉంటుంది. అంతేకాదు ఇవి అల్ట్రావయెలెట్ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.  
  •   సరిపోను నీళ్లు తాగకుంటే చర్మం పొడిబారుతుంది. మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా ఉండాలన్నా, స్కిన్ ఫ్రెష్​గా కనిపించాలన్నా నీళ్లు బాగా తాగాలి. నీళ్లు ఒంట్లోని టాక్సిన్లని బయటకు పంపి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. 
  •   రోజూ అప్పుడప్పుడు కొంచెం సేపు గట్టిగా నవ్వినా కూడా చర్మం బాగుంటుంది. నవ్వినప్పుడు చర్మకణాల్లో రక్తప్రసరణ పెరిగి, కణాలకి ఆక్సిజన్​తో పాటు పోషకాలు సరిపోను అందుతాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
  •   వర్కవుట్లు చేసేటప్పుడు ఎండార్ఫిన్లు అనే కెమికల్స్​ విడుదలవుతాయి. ఇవి పాజిటివ్​ ఫీలింగ్స్​కి కారణమవుతాయి. అప్పుడు  మనసులోని సంతోషం ముఖంలో కనిపిస్తుంది. దాంతో, స్కిన్ హెల్దీగా ఉంటుంది.