అగ్నిపథ్ పై దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

అగ్నిపథ్ పై దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం

త్రివిధ దళాల్లో నియామకాల కోసం ఇటీవల కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ... దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎపీ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయాలను ఢిల్లీ హైకోర్టుకు తీసుకెళ్లాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిల్‌లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు కోరింది. అయితే ఒక అంశంపై అనేక పిటిషన్లు కోరదగినవి, సరైనవి కావని పేర్కొంది. కాగా ఈ స్కీంపై  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రైళ్లకు కూడా నిప్పు పెట్టారు.