బీజేపీ కుట్రలకు భారత్ బలి అవుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ కుట్రలకు భారత్ బలి అవుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారని చెప్పారు.  

రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.