
మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంవీ కృష్ణ. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం,నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 10ఏళ్లుగా మోసం చేశారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇల్లు లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. సింగరేణి సంస్థను కేసీఆర్ ఓ ఏటిఎం లాగా వాడుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థకు రావాల్సిన రూ. 25 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా సంస్థకు నష్టం చేశారని ఆరోపించారు. కేసీఆర్,మోడీలు కలిసి సింగరేణిలోని కొన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో పనిచేసింది కమీషన్ల కోసమేనని విమర్శించారు గడ్డం వంశీ కృష్ణ.