
కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎప్ అధినేత కేసీఆర్ అన్నారు.కాంగ్రెస్ రైతులకు ఇస్తామన్న బోనస్ .. బోగస్ గా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందన్నారు. కనీసం పంట కూడా ప్రభుత్వం కొనలేదంటున్నారు. భూగర్భజలాలు అడుగంటినా.. చెరువులను, చెక్ డ్యాంలను నింపడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులను లూటీ చేయాల్సి వస్తే.. ఇప్పుడు చెరువులు ఎండిపోతున్నాయన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూపాయికే నల్లా కనక్షన్ ఇచ్చామన్నారు. నాలుగేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్యాంకర్లు కొన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కేసీఆర్ దిగిపోయినా తరువాత కరంట్ కష్టాలు వచ్చాయన్నారు. పేదల బాధలు పట్టించుకునే నాథుడే లేడని కేసీఆర్ అన్నారు. మళ్లీ అతిసార వ్యాధి విజృభించే అవకాశం ఉందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాభివృద్దిపై కాంగ్రెస్ దృష్టి సారించడంలేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో నీటి ట్యాంకర్ల ఊసేలేదన్నారు. హైదరాబాద్ లో నీళ్ల ట్యాంకర్ల అవసరం లేకుండా చేశామన్నారు. రైతుబంద్ పథకాన్ని కూడా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో చాలా మంచిగా నడుస్తున్న వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.