సింగరేణి అదానీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే వంశీకృష్ణ గెలవాలె : తీన్మార్ మల్లన్న

సింగరేణి అదానీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే వంశీకృష్ణ గెలవాలె :   తీన్మార్ మల్లన్న

తీహార్ జైల్లో ఉన్న తన బిడ్డను విడిపించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు పట్టబద్రుల కాంగ్రెస్  ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న.  మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని MNR గార్డెన్స్ లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా NSUI యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 

ఈ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు.  సింగరేణి సంస్థ అదానీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలువాలన్నారు.  సింగరేణి సంస్థలో కొత్త బావులు,కొత్త ఉద్యగాలు వస్తాయన్నారు. 

 బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని  చెప్పిన మోదీ.. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వెయలేదన్నారు.  నల్లధనం వెనక్కి తీసుకొచ్చి పేదల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని హామీ ఇచ్చిన మోదీ దానిని మర్చిపోయారన్నారు.