కాంగ్రెస్ పేరుతో ఫేక్ వెబ్ సైట్  .. జైపూర్ వాసి అరెస్ట్​

కాంగ్రెస్ పేరుతో ఫేక్ వెబ్ సైట్  .. జైపూర్ వాసి అరెస్ట్​

హైదరాబాద్‌‌, వెలుగు :  కాంగ్రెస్ పార్టీ పేరుతో ఫేక్ వెబ్ సైట్ రూపొందించి డొనేషన్స్ సేకరిస్తున్న సైబర్ నేరగాణ్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌‌ జైపూర్‌‌‌‌కు చెందిన సురేంద్ర చౌదరి(22)ని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. డొనేషన్స్‌‌ కోసం నిరుడు ‘డొనేట్‌‌ఐఎస్‌‌సీ.నెట్‌‌’ పేరుతో కాంగ్రెస్​ ప్రత్యేక వెబ్‌‌సైట్ రూపొందించింది.  జైపూర్‌‌‌‌కు చెందిన సురేంద్ర చౌదరి ‘డొనెట్​ ఐఎన్​సీ.కో.ఇన్​’ పేరుతో నకిలీ వెబ్‌‌సైట్‌‌ను  రూపొందించాడు.

విరాళాలు వసూలు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో సర్క్యులేట్‌‌ అవుతున్న నకిలీ వెబ్‌‌సైట్ ను కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధులు గుర్తించారు. ఈ నెల 10న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రెస్‌‌ ఆధారంగా జైపూర్‌‌‌‌లో సురేంద్రచౌదరిని అరెస్ట్ చేశారు.