రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల జోరు

రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల జోరు
  •    కేటాయించిన 56,147 సీట్లలో 27,853 ప్రభుత్వానివే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు డిగ్రీ కళాశాలల జోరు నడుస్తోంది. ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపిన విద్యార్థులు, ఇప్పుడు సర్కారు విద్యాసంస్థల్లో సీటు సాధించడం కోసం పోటీ పడుతున్నారు. దోస్త్ (డిగ్రీ ఆన్‌‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ఫస్ట్ ఫేజ్ లో మొత్తం కేటాయించిన సీట్లలో దాదాపు సగం (49.6 శాతం) సీట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే ఉండటం గమనార్హం. 

అయితే, దోస్త్ ఫస్ట్ ఫేజ్​లో మొత్తం 56,147 మంది విద్యార్థులకు సీట్లు లభించగా, ఇందులో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పరిధిలోని 155 ప్రభుత్వ కాలేజీలకు 27,853 సీట్లు అలాట్ అయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వ అటానమస్ కాలేజీలకు విద్యార్థులు క్యూ కట్టారు. వీటిలో 19,774 సీట్లు భర్తీ అయ్యాయి.