చర్చ్ లో బ్యాగుతో ఉగ్రవాది.. 320కి చేరిన శ్రీలంక మృతులు

చర్చ్ లో బ్యాగుతో ఉగ్రవాది.. 320కి చేరిన శ్రీలంక మృతులు

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 320కి చేరినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మూడు చర్చ్ లతో పాటు.. ఐదు ఫైవ్ స్టార్ హోటల్లలో బాంబు దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. నెగొంబోలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చ్ లో బాంబు దాడి జరిగే కొన్ని నిమిషాలముందు ఒక వ్యక్తి బ్యాగుతో చర్చ్ లోపలికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే భారీ బ్లాస్ట్ జరిగిందని చెప్పారు. బ్యాగుతో చర్చ్ లోపలికి వెళ్లినతనే.. బాంబు దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించారు. ఉగ్ర దాడి విషయంలో శ్రీలంకను భారత్ ముందే హెచ్చరించినా అక్కడి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు.  ఉగ్రదాడి చేసింది ‘నేషనల్ తోహీద్ జమాత్’ అనే ఇస్లామిక్ ఉగ్ర సంస్థ అని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.