హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు

హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు

తిరుపతి హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. మఠం ఆస్తులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అతనిని పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై విచారణ జరపాలని నిర్ణయించింది.  ఆయన స్థానంలో శ్రీకాళహస్తి  ఈవో చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ  నేరుగా తిరుపతి మఠం కార్యాలయానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఈవో చంద్రశేఖర్ రెడ్డి  మహంత్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. మఠం ఆస్తుల దుర్వినియోగంపై వంటి పలు ఆరోపణల నేపథ్యంలో స్వామి అర్జున్ దాస్ పై విచారణ జరపనున్నట్లు మీడియాకు వెల్లడించారు.

హథీరాంజీ మఠం ఆస్తులు తిరుపతిలోనే కాక ముంబై, మహారాష్ట్ర , ఢిల్లీ తదితర ప్రదేశాల్లో ఉన్నాయి. అర్జున్ దాస్ వేల కోట్ల రూపాయల మఠం ఆస్తులను ప్రైవేటు వ్యక్తులతో కుమ్మకై దుర్వినియోగం చేశారని.. హేమమహేశ్వరి అనే మహిళను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పలు కేసుల్లో  ఆరోపణలు ఉన్నాయి.

see more news

తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు..దటీజ్ రాజన్నసిరిసిల్ల కలెక్టర్

పెళ్లైన ఏడాది నుంచే టార్చర్.. నాకు న్యాయం చేయండి