రెండు బిల్డింగ్‌ల మధ్య 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి

రెండు బిల్డింగ్‌ల మధ్య 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్: చిలకలగూడాలో దారుణం జరిగింది. వారాసిగుడాకు చెందిన 17 ఏళ్ల ఇర్ఫానా అనే అమ్మాయి రెండు బిల్డింగ్‌ల మధ్య శవమై కనిపించింది. ఇర్ఫానాను ఎవరో హత్య చేసి బిల్డింగ్ పై నుంచి కింద పడేశారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించిన తర్వాత ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. షోయబ్ అనే యువకుడితో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇర్ఫానా ఇంటి సమీపంలో IQ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. దాంతో పోలీసులు ఆ స్కూల్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించనున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఫ్లెక్సీ కనిపిస్తే.. ఫొటో తీయండి.. ట్వీట్ కొట్టండి..

వేడినీళ్లతో ఎంతో మంచిది

న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..